12-02-2025 01:51:57 AM
* కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్, ఫిబ్రవరి 11: ఫారెన్ కరెప్ట్ ప్రాక్ట్రీస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) చట్టం అమలును నిలిపివేస్తూ సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. పోటీ ప్రపంచంలో అమెరికా కంపెనీలకు ఈ చట్టం ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు. ఎఫ్‌సీపీఏ చట్టం మార్గదర్శకాలు, విధివిధానాలను సమీక్షించాలని.. అప్పటి వరకూ ఈ చట్టం కింద తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని అటార్నీ జనరల్ పామ్ బోండిని ఆదేశించారు.
ఎఫ్‌సీపీఏ ఏం చెబుతుందంటే..
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 1977లో ప్రవేశపెట్టిన ఫారెన్ కరెప్ట్ ప్రాక్ట్రీస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) ప్రకారం అమెరికా కంపెనీలు లేదా వారి ప్రతినిధులు వ్యాపారం కోసం విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే అది నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇది అమెరికా కంపెనీల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారాలకు విఘాతం కలిగి స్తోందని ట్రంప్ వాదిస్తున్నారు.
అదానీకి భారీ ఊరట?
ట్రంప్ ప్రస్తుత ఆదేశాల ప్రకారం ఎఫ్‌సీపీఏ చట్టం కింద ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతోపాటు గతంలో తీసుకున్న చర్యల ను అమెరికా సమీక్షిస్తుంది. నూతన చట్టానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన తర్వాత కొత్త మార్గదర్శకాల ప్రకారమే కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుంది.
సవరించిన మార్గదర్శకాల ప్ర కారం అదానీకి సంబంధించి కేసులో అమెరికా పౌరులు నిర్దోషులుగా తేలితే అదానీ, ఆయన సహచరులకు ఊరట లభించే అవకాశం ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ఒప్పం దాల కోసం ఇండియాలో అధికారులకు పె ద్ద మొత్తంలో ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బునే ముడుపుల రూపంలో అధికారులకు అదానీ కంపెనీ చెల్లిందని వా దన బలంగా వినిపించింది.
పాలస్తీనియన్లకు ఆ హక్కు లేదు
గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేశాక పాలస్తీనియన్లకు దా నిలోకి ప్రవేశించే హక్కు ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీ య మీడియాకు ఇచ్చిన ఇంటర్యూ లో ఆయన మాట్లాడుతూ ‘గాజాను స్వాధీనం చేసుకుంటాం. నా ప్రణాళిక ప్రకారం పాలస్తీనియన్లు నివసిం చేందుకు గాజా బయట కొన్ని ప్రాం తాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. పాలస్తీనియన్లను గాజాకు తిరిగి వ చ్చేందుకు అనుమతిస్తారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా లేదు, వారికి ఎలాంటి హక్కు ఉండదన్నారు.