న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఇటీవల 100వ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. అయితే యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారు చేసి న ఈ ఉపగ్రహాన్ని ఇండియా భూభా గం పైన, భూస్థిర కక్ష్యలోకి చేర్చడానికి సాంకేతిక లోపాలు ఎదురవుతున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శాటిలైట్‌లోని లిక్విడ్ ఇంజన్ పని చేయకపో వడంతో దాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఆలస్యం అవుతుం దన్నారు.