మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం బగిరాత్ పల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. బెట్టింగ్ లకు అలవాటు పడిన కుమారుడిని ఓ తండ్రి హత్యచేశాడు. మృతుడు ముకేశ్ కుమార్(28) బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ లో ముకేశ్ రూ. 2 కోట్లు పోగొట్టాడని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెట్టింగులు మానుకోవాలని పలుమార్లు కుమారుడిని తండ్రి హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై దాడిచేశాడు. అర్ధరాత్రి ఇనుప రాడ్డుతో కుమారుడి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయడిన ముకేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.