calender_icon.png 22 January, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్న కూతురుకు ఉరేసిన తండ్రి

22-01-2025 02:41:53 AM

  1. హత్య చేసేందుకు ప్రయత్నం
  2. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

ఇల్లెందు, జనవరి 21: కన్న కూతురుకు ఉరేసి, హత్య చేసేందుకు ఓ తండ్రి యత్నించిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపలిల మండలం సంపత్‌నగర్ గ్రామానికి చెందిన కొర్స రవి, లక్ష్మి దంపతులకు 8, 9, 10 సంవత్సరాల వయస్సు కల్గిన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు తరుచూ గొడవ పడుతుంటారు.

ఈ క్రమంలో రెండేళ్లపాటు లక్ష్మి భర్తకు దూరంగా బంధువుల ఇంట్లో ఉంటోంది. ఇటీవల గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి ఇద్దరిని కలిపారు. అయినా రవిలో ఎలాంటి మార్పురాలేదు. ఈ నెల 13న రవి మద్యం సేవించి భార్యపై కోపంతో చిన్న కూతురు సాహిత్యకు చాక్లెట్లు కొనిస్తానంటూ ఊరిబయట ఉన్న జామాయల్ తోటలోకి తీసుకెళ్లాడు.

చెట్టుకు తువాలతో ఉరిపెట్టాడు. సాహిత్య చనిపోయిందని భావించి వెళ్లిపోయాడు. గంట తర్వాత స్పృహలోకి వచ్చిన సాహిత్య ఇంటికి చేరుకుని తల్లికి విసయం చెప్పింది. లక్ష్మి బోడు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్సై పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.