రోకలితో మోది హత్య చేసిన భార్యలు
సూర్యాపేట, జనవరి 13: కూతురును లైంగికంగా వేధిస్తున్న తండ్రిని.. అతడి ఇద్దరు భార్యలు రోకలితో మోది హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం గుర్రంతండాలో సోమవారం జరిగింది. తండాకు చెందిన రత్నావతి సైదులు (40) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గతంలో ఇద్దరు సొంత అక్కాచెళ్లెల్లను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో కూతరును సైదులు లైంగికంగా వేధిస్తుడటంతో భరించలేని ఇద్దరు భార్యలు.. సైదులు ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోది హత్య చేశారు. కాగా మృతుడి చిన్నమ్మ కళావతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.