calender_icon.png 22 October, 2024 | 9:43 AM

కనిపెంచిన నాన్నకు రోడ్డే దిక్కు..

22-10-2024 01:12:25 AM

వృద్ధాప్యంలో తండ్రిని పట్టించుకోని కుమారులు

దిక్కుతోచని స్థితిలో తండ్రి

రోడ్డు పక్కనే రోజుల 

తరబడి జీవనం

సూర్యాపేట, అక్టోబర్ 21: అన్నీ తానై కుటుంబాన్ని నడిపించిన తండ్రికి వృద్ధాప్యం లో పెద్ద కష్టం వచ్చింది. ముగ్గురు కొడుకుల ను ఉన్నత స్థాయికి చేర్చినా చివరికి దిక్కులే ని వాడయ్యాడు. సూర్యాపేట జిల్లా పెన్‌ప హాడ్ మండలంలోని లింగాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒక పక్క వ్యవసా యం చేస్తూనే మరో పక్క కల్లుగీత కార్మికు డిగా కష్టపడుతూ వారిని ప్రయోజకులను చేశాడు. పెద్ద కుమారుడు అరవింద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు చంద్రం సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మూడో కుమారుడు కృష్ణయ్య సూర్యాపేటలో ఫైర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొడుకులు వేరు కాపురాలు పెట్టగా అంజ య్య తన భార్యతో కలిసి గతంలో వేరుగానే ఉన్నారు. మూడేండ్ల క్రితం భార్య అనా రోగ్యంతో మృతి చెందగా నాటి నుంచి అంజ య్య కుమారుల వద్దే ఉంటున్నాడు. కొంత కాలం బాగానే చూసిన కొడుకులు ఆ తర్వా త పట్టించుకోవడం మానేశారు. ఆయన పేరున ఉన్న 1.20 ఎకరాల భూమిలో సుమారు ఎకరం పదిగుంటల భూమిని పట్టా చేసుకోవడంతో పాటు డబ్బును సైతం ఓ కుమారుడు తీసుకున్నాడు. తన సమ స్యను గతంలో అంజయ్య జిల్లా కలెక్టర్‌కు వెల్లబోసుకున్నా ఎటువంటి చర్యలు తీసుకో లేదు. దీంతో చేసేదేమీలేక సూర్యాపేట పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన గల ఓ అపార్ట్‌మెంట్ వద్ద రోడ్డు పక్కనే ఉం టూ రోజులు గడుపుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని అంజయ్య కోరుతున్నాడు.