నేడు ఎంఎస్ స్వామినాథన్ వర్ధంతి :
హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అల్పా దాయాలతో కునారిల్లుతున్న భార త వ్యవసాయానికి ఊపిరిపోశారు. అధిక ఉత్పత్తులను ఇచ్చే వరి, గోధు మ వంగడాలను సృష్టించడం ద్వా రా రైతుల ఆదాయాలు పెరగడానికి కృషి చేశారు.
స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్తగానే కాకుండా వృ క్ష జన్యు పరిశోధకుడిగా, మానవతావాదిగా ప్రసిద్ధి చెందారు. ఆయన సేవలకు గుర్తుగా 1987లో అత్యున్న తమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. చెన్నైలో ఎం. ఎస్ స్వామినాథం రీసెర్చ్ సెంటర్ పెట్టి వ్యవసాయ రంగ పరిశోధనలు తుది వరకు కొనసాగించారు.
స్వామినాథన్ 1971లో మెగసెసే అవార్, ఐన్‌స్టీన్ వరల్డ్‌సైన్స్ అవార్డు (1986) లాంటి పురస్కారాలు అందుకున్నా రు. వ్యవసాయ రంగ చరిత్రలో ఆ యన సేవలు చిరస్మరణీయాలు.
దేశ ఆదాయంలో70శాతం వ్యవసాయం అందిస్తున్నప్పుడు భారతదేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం పట్ల స్వామినాథన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు .భవిష్యత్తులో భారతదేశం ఆహార ఎగుమతిదారుగా మార్చాలని సంకల్పంతో తుదివరకు కృషి చేశారు. ప్ర పంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే బాస్మతి బియ్యాన్ని అ భివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తగా తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధిక దిగుబడి ఇచ్చే గోధుమ రకాలు, ఎరువులు, రైతులపై తక్కువ భారం వేసే వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు నేర్పించారు. స్వామినాథన్ 1960లో ఇతర శాస్త్రవేత్తలతో కలిసి హరిత విప్లవాన్ని దేశవ్యాప్తంగా పరివ్యాప్తి చేయడానికి కృషి చే శారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో కలిసి వ్యవసా య కార్యక్రమాలను, విధానాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ 1979 నుండి 1980 వరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా, 1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసె ర్చ్ డైరెక్టర్ జనరల్ గా, 1980 నుండి 1982 వరకు ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేశారు. స్వామినాథన్ 2023 సెప్టెంబర్ 28న చెన్నైలో కన్నుమూశారు.
ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనను మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారమైన‘భారత రత్న’తో సత్కరించింది. రైతు తాను పండించిన పంటకు తానే మద్దతు ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వటం, మొత్తం కరువు లేని సమాజాన్ని సాకారం చేయడమే స్వామినాథన్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.
నేదునూరి కనకయ్య