మద్యానికి బానిసైన కొడుకు ఘాతుకం
కామారెడ్డి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మద్యం సేవించేందుకు డబ్బులివ్వలేదని తండ్రిని కొడుకు చంపిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. రద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రా మానికి చెందిన హైమాద్(55)ను తన చిన్న కొడుకు మహబూబ్ అలియాస్ బబ్లు ఆదివారం మద్యం సే వించేందుకు డబ్బులు అడిగాడు.
ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న మహబూబ్.. అదేరోజు రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న హైమాద్‌ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సోమవారం మృతుడి పెద్ద కుమారుడు జమీల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ కృష్ణ వెల్లడించారు.