calender_icon.png 16 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి సౌదీలో.. కొడుకు ఆసుపత్రిలో..

16-01-2025 12:53:06 AM

జగిత్యాల, జనవరి 15 (విజయక్రాంతి): ఉన్న ఊళ్లో కుటుంబ పోషణ భారమై, ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ గల్ఫ్ కార్మికుని కుటుంబ దీన గాధ ఇది... జగిత్యాల పట్టణం 29వ వార్డుకు చెందిన కుక్కల చిన్న భీమయ్య ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్ళాడు. కాగా వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్’లో అక్రమ నివాసిగా ఉండి పోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్మారో (ఎముకల్లో మూలుగు లోపం) వ్యాధితో బాధ పడుతూ ఆసుపత్రి పాలయ్యాడు.హొ పరీక్షించిన డాక్టర్లు దీనికి పరిష్కారం బోన్మారో మార్పిడి మాత్రమేనని సూచించారు.

అయితే కొడుకుకు బోన్మారో మార్పిడి చికిత్సకు దాతగా తండ్రి చిన్న భీమయ్య సిద్ధమవడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఆ పేద కుటుంబానికి. దీంతో సౌదీలో చిక్కుకున్న చిన్న భీమయ్యను రప్పించాలని అతని భార్య గంగలక్ష్మి కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహాయంతో సీఎం రేవంత్’రెడ్డికిహొ బుధవారం మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. బోన్మారో దాతగానే కాకుండా, చికిత్సకు కావలసిన డబ్బు కోసం తమ ఇల్లు అమ్మడానికి సైతం భీమయ్య ఇండియాకు రావలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.

సౌదీలో ఉన్న సామాజిక సేవకులు గాజుల నరేష్ స్థానిక అధికారులతో పాటూ రియాద్లో ఉన్న ఇండియన్ అంబసీతో సమన్వయం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చిన్న భూమయ్య స్వదేశం రావడానికి, కొడుకు సునీల్’ను కాపాడుకోవడానికి అవసరమైన చికిత్సకు సహకరించాలని గంగ లక్ష్మి కోరింది.