calender_icon.png 11 October, 2024 | 12:43 PM

తండ్రి కల నెరవేర్చారు

11-10-2024 12:30:41 AM

డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అక్కాచెళ్లెల్లు

కొడంగల్, అక్టోబర్10: తాను సాధిం చలేనిది తన పిల్లలతోనైనా సాధింపజేసి తన కళను నెరవేర్చుకోవాలనుకున్నాడు ఓ తండ్రి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ఇద్దరు కూతుళ్లను ఉపాధ్యా యులను చేయాలనే పట్టుదలతో వారిని చదివించాడు.

తండ్రి కష్టాన్ని, తమపై ఉంచి న నమ్మకాన్ని ఆ కూతుర్ల వృథా చేయలేదు. తండ్రి కలతో పాటు, వారి ఆశయాన్ని నెరవేర్చుకు న్నారు ఆ అక్కాచెళ్లెల్లు. వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్ మండల పరిధిలోని  హస్నాబాద్ గ్రామానికి చెందిన కోట్ల శ్రీశైలంగౌడ్ వృత్తిరీత్యా రైతు. అతడికి ముగ్గు రు సంతానం.

పెద్ద కూతురు సుధ, రెండవ కూతురు శ్రీకావ్య, కుమారుడు సుధాకర్. బీఎస్సీ, బీఎడ్ పూర్తిచేసిన శ్రీశైలం గౌడ్ ఉపాధ్యాయ ఉద్యగం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సాధించలేకపోయాడు. పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఇలా వయస్సు పెరిగిపోతున్నప్పటికీ చివరి ప్రయత్నంగా 2009లో డీఎస్సీ రాసినప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయాడు.

తదనంతరం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తాను సాధించనది తన కుమార్తెలైనా సాధించాలని తపించిన శ్రీశైలం గౌడ్ తన కుమార్తెలను బాగా చదివించాడు. వారిని డీఎడ్, బీఎడ్ చేయిం చాడు. పెద్ద కూతురు సుధ కొన్నాళ్లు కొడంగల్‌లో విద్యా వలంటీర్‌గా పనిచేసింది.

ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సుధ.. డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్)లో జిల్లా మొదటి ర్యాంకు సాధించడంతో పాటు మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు సాదించింది. అదేవిదంగా డీఎడ్ పూర్తిచేసిన శ్రీ కావ్య ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కళాశాలలో బీఎడ్ చదువుతూ డీఎస్సీ రాసి ఎస్‌జీటీగా ఎంపికయ్యింది.

ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుతూ.. తమ తండ్రి పడిన శ్రమను ప్రత్యక్షంగా చూసి ఆయన కలను సాకారం చేయాలనుకున్నామని.. ఆ కల నేటికి నెరవేరిందని భావోద్వేగమయ్యారు. గ్రామస్తులు వారి కుటుంబ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ ఉద్యోగి కూతుళ్లు

వికారాబాద్ జిల్లా కేంద్రం ఎల్‌ఐజీ కాలనీకి చెందిన మహ్మద్ సాబేర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన ఇద్దరు కూతుళ్లు నిఖత్ ఉన్నీసా, షాహీన్ ఉన్నీసాను డీఎడ్ చదివించాడు. తమ తండ్రి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆ ఇద్దరు కూతుళ్లు మొదటి ప్రయత్నంలోనే ఎస్జీటీ ఉద్యోగాలు సాధించారు. ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంపై ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవు. ప్రణాళికతో చదివి తమ తల్లిదండ్రుల కళను నెరవేర్చామని ఆ ఇద్దరు కూతుళ్లు చెప్పుకొచ్చారు.