calender_icon.png 19 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు ఢీకొని తండ్రి మృతి, కొడుకుకు గాయాలు

12-04-2025 01:03:05 AM

సుజాతనగర్ మండలంలో ఘటన 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 11 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే చతిస్గడ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన దినేష్ కూలి పనుల నిమిత్తం తరలివచ్చి ములకలపల్లి మండలం ధర్మనగర్ వద్ద నివసిస్తున్నాడు.

సుజాతనగర్ వద్ద తన కుమారుడితో కలిసి రోడ్డు దాటుతున్న క్రమంలో భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వైపు వెళ్తూ ఢీ ఏ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారిని హుటా వోటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పొడియం దినేష్ (39) మృతి చెందాడు. పక్కనే ఉన్న కుమారుడికి గాయాలు అయ్యాయి. మాటలు సరిగా రాకపోవడం, తెలుగు భాష తెలియకపోవడం ఎవరికి అర్థం కాలేదు.

మృతుడి బంధువులు వచ్చిన తర్వాత విషయాలు తెలుసు వెలుగులోకి వచ్చాయి. మృతటికి భార్య లక్ష్మి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడికి నాలుగు సంవత్సరాలు కాగా, కుమార్తెలకు వరుసగా 1,2,3 సంవత్సరాలు కావడం కడు దయనీయ పరిస్థితి. మృతుడు తమ్ముడు పాండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్త్స్ర రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.