calender_icon.png 22 February, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

15-02-2025 07:01:06 PM

తండ్రి మృతి, కూతురికి గాయాలు

గల్ఫ్ నుంచి వచ్చి ఇంటికి వస్తుండగా  ప్రమాదంలో మృతి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ(Yellareddy Gayatri Sugar Factory) వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నిజాంబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామానికి  చెందిన గంగాధర్(48) కారులో తన కూతురిని హైదరాబాద్ నుంచి తీసుకొని స్వగ్రామానికి వస్తుండగా అడ్లూరు ఎల్లారెడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారు బస్సును ఢీకొట్టడంతో కారులో ఉన్న గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ హాస్టల్లో చదువుకుంటున్న గంగాధర్ కూతురు లహరిని తీసుకొని స్నేహితుడి కారులో ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సదాశివ నగర్ రు మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో 44వ జాతీయ రహదారి హైవే బ్రిడ్జి వద్దకు రాగానే వారి కారు ముందు వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో కారు అదుపు తప్పి  డివైడర్ను మరో లారీని డి కొనడంతో  గంగాదర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడ్డ లహరిని జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. గంగాధర్ ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చి తన కూతురు లహరిని హైదరాబాద్ నుంచి హాస్టల్ నుంచి కారులో తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. మృతుడు గంగాధర్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.