సిద్దిపేట: రెండు భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి ప్రాణలు తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో సహ తండ్రి చింతల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలిపారు. మృతులను తేలు సత్యం(48), పిల్లలు అన్వేష్(7), త్రివేణి(5) గా గుర్తించారు. రెండో భార్య భర్తతో గొడవ పడి కొన్ని రోజులుగా దూరంగా ఉంటుంది. దీంతో సత్యం మానసిక ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే మొదటి భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువులోంచి మృతదేహాలను వెలికి తీసి శవ పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.