calender_icon.png 26 November, 2024 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్య

26-11-2024 01:21:01 AM

జీవితంలో ఓడిపోయానని సూసైడ్ నోట్

కామారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి): తన 18 నెలల కూతురుతో కలిసి ఓ తండ్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం న్యాల్‌కల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాకు చెందిన క్రాంతి(35), మానస దంపతులు. వారికి 18 నెలల వయస్సున్న ఇద్దరు కూతుళ్లు(కవలలు) ఉన్నారు.

క్రాంతి డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన పెద్దకూతురుతో కలిసి బైక్‌పై న్యాల్‌కల్ చెరువు వద్దకు వెళ్లి, కూతురుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్ప డిన ట్టు ప్రత్యక్ష సాక్షు లు తెలిపారు. కా గా జీవితంలో తాను ఫెయిల్ అయినందునే కూతురుతో కలిసి చనిపోతున్నానని క్రాంతి రాసిన సూసై డ్ నోటలో పేర్కొన్నట్లు తెలిసింది. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు 5వ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.