22-04-2025 05:02:34 PM
భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన..
చిట్యాల/రేగొండ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో తండ్రి కొడుకును కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. రేపాకపల్లె గ్రామానికి చెందిన కాసం మొండయ్య తన కొడుకు ఓదెలుకు సోమవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓదెలు తలపై మంగళవారం ఉదయం తండ్రి మొండయ్య కర్రతో కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ఇరువురి మధ్య ఘర్షణ కారణంగానే కన్న కొడుకును తండ్రి కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. కొడుకును హత్య చేసిన తండ్రి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.