calender_icon.png 16 January, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

11-07-2024 02:17:52 AM

  1. చెరువులోకి దూసుకెళ్లిన కారు
  2. కారులో ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి
  3. కాపాడిన స్థానికులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 10: ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడలో చోటుచేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. అల్మాస్‌గూడలోని తిరుమల నగర్‌కు చెందిన అశోక్ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అశోక్, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారనే భయంతో వారితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గం టల సమయంలో ముగ్గురు పిల్లలు అభిజ్ఞ (14), శ్రీధర్ (13), సహస్ర (9)ను తీసుకొని వాకింగ్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి కారులో బయటకు వెళ్లాడు. సిటీ శివారు ప్రాంతమైన ఇనాంగూడ చెరువు వద్దకు చేరుకున్నాడు. కారు వెళ్లే దారిలేకపోయినప్పటికీ చెట్ల మధ్యలో నుంచి కారుతో చెరువులోకి దూసుకెళ్లాడు. ఇది గమనించిన కల్లు గీత కార్మికులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి ముగ్గురు పిల్లలతో సహా అశోక్‌ను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు న్నారు. ఇదిలా ఉండగా అశోక్ ఉదయం ఇంట్లో గొడవ పెట్టుకొని పిల్లలతో బయటకు వెళ్లగానే అశోక్ తమ్ముడు సంజీవ మీర్‌పేట్ పోలీసులకు సమచారం అందించాడు. అశోక్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడని గు రించారు. ఈ మేరకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.