calender_icon.png 18 October, 2024 | 11:46 PM

డ్రగ్స్ దందాలో తండ్రీకొడుకు అరెస్ట్

27-07-2024 10:07:21 PM

రూ. 12 లక్షల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం 

హైదరాబాద్: ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేక డ్రగ్ పెడ్లర్లుగా మారారు తండ్రీకొడుకులు. అధికంగా డబ్బు వస్తుందనే ఆశతో డ్రగ్స్‌ను విక్రయిస్తూ పోలీసులకు పెట్టుబడ్డారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు తండ్రికొడుకులను అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన హనీఫ్ షా అలియాస్ హనీఫ్(65)కి ఏనిమిది మంది సంతానం. కుటుంబ పోషణ బారమవడం, ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి, తన మూడవ కుమారుడు సిద్ధిఖీ షా అలియాస్ సిద్ధిఖీ(31) ఇద్దరు కలిసి మింటూ అనే వ్యక్తి వద్ద మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి వాటిని విక్రయించడానికి నగరానికి చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు జరిపి డ్రగ్స్ విక్రయిస్తున్న తండ్రికొడుకులను మహేశ్వరం ఎస్‌వోటీ టీమ్ బాలాపూర్ పోలీసులతో కలిసి శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన 100 గ్రాముల హెరాయిన్, రూ.13 వేల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.