calender_icon.png 26 February, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యానికి తండ్రి కొడుకు బలి

26-02-2025 07:39:29 PM

చెరువులో మునిగి దుర్మరణం..

లంగర్ హౌస్ హుడా పార్కు శుభ్రం చేస్తుండగా ఘటన.. 

కార్వాన్ (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యానికి తండ్రీ కొడుకు బలయ్యారు. ఎలాంటి సేఫ్టీ గార్డ్స్ ధరించకుండా చెరువు శుభ్రం చేస్తుండగా అందులో మునిగి దుర్మరణం చెందారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు  శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం(38) శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల కరీం తన కొడుకు సాహిల్(15) 9వ తరగతి విద్యార్థి తనతో పాటు తీసుకువచ్చాడు. 

రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మహమ్మద్ కరీం తన కొడుకు సాయిల్ తో కలిసి వుడా పార్క్ చెరువులోని గడ్డి శుభ్రం చేసే క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బుడదలు ఇరుక్కుపోయి తన తండ్రిని సహాయం కోరడంతో తండ్రి కూడా వెళ్లి తన కొడుకు చేయిపట్టే క్రమంలో ఇద్దరు నీళ్లలో లోతుగా తుడుచుకుపోయిన బుడదలు ఇరుక్కుపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ ఎండమాలజీ సూపర్వైజర్ కి రమేష్ కు తెలుపడంతో సూపర్వైజర్ లోకల్ ఏరియా లీడర్లకు చెప్పడంతో వారు కార్ వాల్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ దీనికి సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సమాచారం ఇవ్వడంతో అర్ధగంట వ్యవధిలో డిఆర్ఎఫ్ టీం ఘటన స్థలానికి చేరుకొని గంట సమయంలో ఇద్దరు మృతదేహాలని వెలికి తీయడం జరిగింది.

ఎమ్మెల్యే కౌసర్ మోయునుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ... కొంతకాలం నుంచి తాము జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ తో ఎఫ్టిఎల్ మెషిన్ గురించి ఎన్నోసార్లు అడిగిన.. కమిషనర్ ఏదో సాకు చెప్పి ఎఫ్.టి.ఎల్ మెషిన్ ని అలర్ట్ చేయలేదు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కనీసం లైఫ్ జాకెట్స్ లు కూడా వీళ్ళకి ఇవ్వకపోవడంతో ఈరోజు ఇలా సంఘటన జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ దుర్ఘటననికి సంబంధించి ఎమ్మెల్యే తన పార్టీ తరఫున గవర్నమెంట్, జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి బాధితుల కుటుంబాలు తండ్రి కొడుకు కావడంతో పెద్దదిక్కు కావడంతో ఇప్పుడు వాళ్లకి ఏదో విధంగా ఎక్స్గ్రేషియా గురించి అడుగుతామని తెలిపారు. ఇలా ఉండగా ఒక బాధ్యత గల ఎంటమాలజీ సూపర్వైజర్ రమేష్ 15 సంవత్సరాల అబ్బాయిని ఈ పనిలో ఎట్లా పర్మిషన్ ఇస్తారని ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.