ఏడు సంవత్సరాల పాపతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి
నిజాంబాద్ జిల్లాలో కలకలం
కామారెడ్డి, (విజయక్రాంతి): ఏడు సంవత్సరాల పాపతో కలిసి చెరువుల దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ లోని వర్ని చౌరస్తాలో నివాసం ఉంటున్నా రు. క్రాంతి (35) సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాపతో కలిసి సోమవారం ఉదయం చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. గజ ఈతగాళ్లు చెరువులో గాలిస్తున్నారు. ఏడేళ్ల చిన్నారీ తో బైక్ పై వచ్చిన క్రాంతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రే పుతుంది.