మంటలొస్తున్నాయని వదంతులు.. నిజమని నమ్మి కిందకి దూకిన జనం
జల్‌గావ్, జనవరి 22: మహారాష్ట్రలోని జ ల్‌గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చో టుచేసుకుంది. ఊహకందని రీతిలో జరిగిన ప్రమాదంలో 12 మంది మృత్యు ఒడిలోకి చే రుకున్నారు. దాదాపు ఏడుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. లక్నో నుంచి వ స్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపిస్తున్నాయని పుట్టిన వదంతులు నిజమని నమ్మిన కొంత మంది ప్రయాణికులు చెయిన్ లాగి కిందకు దూకేశారు. అదే అదుర్తాలో పట్టాలు దాటుతుండగా.. ఎదురుగా వచ్చిన రైలు ఢీ కొట్టుకుంటూ దూసుకెళ్లింది.
అసలేం జరిగిందంటే..
లక్నో నుంచి ముంబైకి (పుష్పక్ ఎక్స్‌ప్రెస్) వస్తున్న క్రమంలో రైలులో మంటలు చెలరేగినట్లు వదంతులు వ్యాపించాయి. ఇది నిజమని నమ్మిన ప్రయాణికులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవద్దనే ఉద్దేశంతో ఆ రైలు చైన్ లాగి కిందకు దూకేశారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు (కర్ణాటక ఎక్స్‌ప్రెస్) పట్టాలు దాటుతున్న ప్రయాణికులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు.
రైలు ప్రమాద ఘటన కలిచి వేసింది..
రైలు ప్రమాదం గురించి తెలిసి షాకయ్యా. హృదయాన్ని కలిచి వేసింది. కుటుంబాలను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
అలా మంటలు వచ్చాయి...
పుష్పక్ రైలులోని ఓ బోగీలో హాట్ యాక్సిల్ లేదా బేక్ బైండింగ్ వల్ల నిప్పు రవ్వలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటననే కొంత మంది అగ్ని ప్రమాదంగా చిత్రీకరించగా.. ఏమీ తెలియని అమాయకులు చైన్ లాగి కిందకు దూకారు. ప్రయాణికులు చైన్ లాగడంతోనే రైలు ఆగింది. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు ఆదరబాదరాగా దూకి పరుగులు తీసే క్రమంలో మరో ట్రాక్‌పై వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయారు.