మహారాష్ట్ర,(విజయక్రాంతి): జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్(Pushpak Express)లో మంటలు చెలరేగాయని పుకార్లు వినిపించాయి. దీంతో రైలులోని ప్రయాణికులు ప్రాణ భయంతో ట్రైన్ చైన్ లాగి ఆపేశారు. అనంతరం ట్రాక్ మీదకు దిగి పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్(Karnataka Express) రైలు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయలయ్యాయి. ఈ దుర్ఘటన జల్‌గావ్‌లోని పరండా స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రయాణికులు, స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్య్కూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలను నిర్వహించారు. గాయపడిన ప్రయాణికులను వైద్య చికిత్స కోసం సమీపంలోని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.