calender_icon.png 5 January, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

04-01-2025 12:09:53 AM

నలుగురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

పటాన్‌చెరు: నల్లవల్లి అటవీ ప్రాంతంలో మెదక్ బాలానగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన ఐశ్వర్యలక్ష్మీ(20), నర్సాపూర్‌లో ఏఈగా పని చేస్తున్న మనీషా(25), ఎల్లారెడ్డిగూడెంకు చెందిన ప్రవీన్(30) అక్కడికక్కడే మృతి చెందారు. కౌడిపల్లికి చెందిన అనసూయ(62)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ఏఎస్‌పీ సంజీవరావు, పటాన్‌చెరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ నయీమొద్దీన్ పరిశీలించారు. మృతదేహాలను నర్సాపూర్  ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.