22-03-2025 04:21:51 PM
10వ తరగతి విద్యార్థిని మృతి...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని మృతి చెందగా, ఆమె అన్నకు తీవ్ర గాయాలు అయిన ఘటన శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన ప్రభాతి ఛత్రియ (16) టెలికాంనగర్ లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. రోజు మాదిరిగానే శనివారం తన అన్న సుమన్ ఛత్రియ బైక్ పై పరీక్షకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం డబ్బుల్ డెక్కర్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్ పై కూర్చున్న ప్రభాతి ఛత్రియ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె అన్న సుమన్ ఛత్రియాకు తీవ్ర కాగా అతనిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ప్రభాతి ఛత్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.