calender_icon.png 25 April, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

25-04-2025 12:28:26 AM

ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన లారీ, ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు

తిమ్మాపూర్, ఏప్రిల్ 24, (విజయక్రాంతి): రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లా రేణిగుంట వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పోలీసులు స్థానికుల కథనం మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి నుంచి కరీంనగర్ కు ఆరుగురు ప్యాసింజర్లతో ఆటోలో వస్తుండగా రేణిగుంట వద్దగల ఆర్కే ఇండస్ట్రీస్ రైస్ మిల్ నుంచి లారీ అజాగ్రత్తగా అతివేగంతో రాజీవ్ రహదారి పైకి వచ్చి రోడ్డుపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టింది.

దీంతో ఆటో డ్రైవర్ కాసర్ల తిరుపతి అక్కడికక్కడే మృతిచెందాగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించేందుకు హెచ్ కె ఆర్ అంబులెన్స్ కు సమాచారం అందించినప్పటికీ సరైన వేలకు స్పందించకపోవడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపి శుభం ప్రకాష్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను స్థానిక ఎస్త్స్ర వివేక్ ను అడిగి తెలుసుకున్నారు.

హెచ్‌కేఆర్ సిబ్బందికి ఏసీపీ వార్నింగ్ 

రేణిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ పరిశీలించి అక్కడే ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ప్రమాదాలు జరిగితే గాని స్పందించరా గతంలో ప్రమాద స్థలాలను గుర్తించి తమ స్టాఫ్ కు  సూచనలు అందించామని అయినప్పటికీ స్పందించకపోవడంపై ఆయన సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు.

ప్రమాదాలు జరిగితే హెచ్ కె వారినే బాధ్యులను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో డివైడల వద్ద లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్ నుండి హెచ్ కె ఆర్ యాజమాన్యానికి లెటర్ రాయడం జరిగిందని ఇప్పటివరకు స్పందించలేదని ఆయన అన్నారు.