calender_icon.png 27 December, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

26-12-2024 04:01:35 AM

లోయలో పడిన బస్సు, ముగ్గురు మృతి

డెహ్రాడూన్, డిసెంబర్ 25: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 24 మందికి గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖం డ్ నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో భీమాటాల్ నుంచి హల్దానీకి వెళ్తోంది. ఈ క్రమంలో భీమ్‌తాల్‌లోని అమ్దాలి సమీపంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న 1500 అడుగుల లోయలో పడింది. 

ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసు లు, స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నైని టాల్ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలను ఘటనా స్థలా నికి చేరుకున్నాయి. ప్రమాదదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ థామి ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించా లని అధికారులను ఆదేశించారు.