calender_icon.png 19 January, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణె శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

03-07-2024 12:10:55 AM

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఐదుగురు దుర్మరణం

ఒకరికి తీవ్ర గాయాలు

నారాయణఖేడ్, జూలై 2: మహారాష్ట్రలోని పుణె శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  వివరాలిలా ఉన్నాయి.. నారాయణఖేడ్‌కు చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్ దర్గా సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు పుణె శివారులోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌కు చెందిన రఫిక్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషి, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతిచెందారు.

అదే విధంగా నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ గ్రా మానికి చెందిన సయ్యద్ అమర్‌కు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, కారు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియ రాలేదు. ప్రమాదంపై అక్కడి పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని సమాచారం. యువకుల మరణంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.