calender_icon.png 15 January, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

15-01-2025 06:13:28 PM

కారు ఆటో ఢీ ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం...

కల్వకుర్తి మండలం వేపూరు చౌరస్తా వద్ద ఘటన..

కల్వకుర్తి (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా(Nagar Kurnool district) కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ఆటో ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... తోటపల్లి గ్రామానికి చెందిన మహేష్(22), బంగారయ్య(45) తల్లి బంగారమ్మ స్నేహితుడు శ్రీపతి(22) నలుగురు బుధవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణానికి ఆటోలో బయలుదేరారు. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ వైపు వస్తున్న టీఎస్ 07జివై 7973 నంబర్ గల కారు వేపూరు చౌరస్తాలోని కాటన్ మిల్లు వద్ద ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహేష్ బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందగా వారి తల్లి బంగారమ్మ స్నేహితుడు శ్రీపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానికులు గుర్తించి 108 సాయంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.