calender_icon.png 18 January, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లికూతురును బలిగొన్న లారీ

17-01-2025 05:18:16 PM

మైలార్ దేవ్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం...

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఓ లారీ తల్లి కూతుర్ని బలిగొంది. లారీ బైక్ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న భార్య, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌజ్ కు చెందిన అజీం బైకుపై తన భార్య కొడుకు, కూతురుతో ఫలక్‌నామా వెళుతున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో మైలార్దేవ్ పల్లిలోని పల్లె చెరువు వద్ద బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ వాహనాన్ని ఢీకొంది. దీంతో అజీమ్ భార్య రుక్సానా బేగం, 3 సంవత్సరాల కూతురు సిఫా అక్కడికక్కడే మృతి చెందారు. అజీమ్ అతని కుమారుడు ముజమిల్ కు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని లారీని ధ్వంసం చేసి లారీ డ్రైవర్ పై దాడి చేశారు.