calender_icon.png 11 January, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసిగండిలో ఘోర రోడ్డు ప్రమాదం

11-01-2025 03:45:52 PM

స్కార్పియో ఢీకొని ఇద్దరు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు

మృతులు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామస్థులుగా గుర్తింపు

కడ్తాల్, (విజయక్రాంతి): హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. శనివారం కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..  మాడ్గుల మండలం ఇర్విన్ పంచాయితీ పరిధిలోని దిల్వార్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన బావాజీ వెంకటయ్య, బావాజీ బిమయ్య, శివ బైక్ పై హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళుతుండగా మైసిగండి వద్ద వెనుకాల వస్తున్న స్కార్పియో కారు బైక్ ను  ఢీకొట్టి బులెరా వాహనాన్ని ఢీకొనగా బులెరా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న  వెంకటయ్య, బిమయ్య  ఇద్దరు దుర్మరణం చెందారు. గాయపడ్డ శివని ఆస్పత్రికి తరలించారు.  సంఘటన స్థలానికి కడ్తాల్ సీఐ శివప్రసాద్, ఎస్సై వరప్రసాద్ చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చెసినట్లు సీఐ తెలిపారు.