calender_icon.png 11 January, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

11-01-2025 12:38:36 AM

ముగ్గురు యువకులు మృతి

జగిత్యాల అర్బన్, జనవరి10: ముక్కోటి ఏకాదశి పండుగ వేళ జగిత్యాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లిలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.

జగిత్యాల మండలం జాబితా పూర్కు చెందిన బత్తుల సాయి(20) భూత గడ్డ అరవింద్(21) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై ఎదు రుగా వస్తున్న మేడిపల్లి మండలం కొండా పూర్ గ్రామానికి చెందిన వంశీ(20) ఢీ కొట్టాడు. రెండు ద్విచక్ర వాహనాలు బలం గా ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన సాయి, అరవింద్ అక్కడికక్కడే మృతి చెంద గా, వంశీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలోనే మృతి చెందాడు.

సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ అశోక్’కుమార్, డీఎస్పీ రఘుచందర్ చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో జాబితాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు.