calender_icon.png 9 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

05-01-2025 06:00:34 PM

హైదరాబాద్: మేడ్చల్ చెక్ పోస్టు(medchal check post) వద్ద ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను తీసుకెళ్తుండగా ఆదుపుతప్పిన లారీ వేగంగా వచ్చి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నా పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.