calender_icon.png 8 January, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర విమాన ప్రమాదం

30-12-2024 03:55:31 AM

* అదుపు తప్పి గోడను ఢీకొని పేలిన విమానం

* 179 మంది దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

* మృతుల్లో ఇద్దరు థాయ్ దేశస్థులు

* వారం రోజులపాటు సంతాప దినాలు

* పక్షి ఢీ కొనడంతోనే ప్రమాదం జరిగినట్టు అనుమానం?

సియోల్, డిసెంబర్ 29: కజకిస్థాన్ విమాన ప్రమాద ఘటనను మరువకముందే దక్షిణ కొరియాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.  బ్యాంకాక్ నుంచి ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు దక్షిణ కొరియాకు 181 మందితో బయల్దేరిన జేజు ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 800శ్రేణి విమానం ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 9.07 గంటల సమయంలో(స్థానిక కాలమానం ప్రకారం) అదుపుతప్పింది. ఈ క్రమంలోనే విమానం వేగంగా విమానాశ్రయంలోని రక్షణ గోడను ఢీకొని ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది రం గంలోకి దిగి మంటలను ఆర్పేందుకు తీవ్రం గా శ్రమించారు. ఈ ప్రమాదంలో 175 మం ది ప్రయాణికులు సహా నలుగురు విమాన సిబ్బందితో కలిపి మొత్తం 179 మంది ప్రా ణాలు కోల్పోయారు. ఇద్దరు విమాన సి బ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్ర మాదం నుంచి బయటపడిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ప్రమాదంలో మొత్తం విమానం మొత్తం ధ్వంస మైందని యుయాన్ ఫైర్ స్టేషన్ చీఫ్ లీ జియోంగ్‌హైయోన్ పేర్కొన్నారు. ప్రమా దం గురించి తెలిసిన వెంటనే దక్షిణ కొరి యా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు చనిపోయిన వారిలో ఇద్దరు థాయ్ ప్రయాణికులు కూడా ఉన్నట్టు థాయ్‌లాండ్ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ప్రమాదంపై అనుమానాలు

ల్యాండింగ్ గేర్‌లో సమస్యను గుర్తించిన పైలెట్లు అత్యవసర పరిస్థితుల్లో బెల్లీ ల్యాం డింగ్‌కు ప్రయత్నించారు. అయితే ఈ బెల్లీ ల్యాండింగ్ సమయంలో జరిగిన పరిణామాలపై పలువురు మాజీ పైలెట్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బెల్లీ ల్యాండింగ్‌కు విమానాశ్రయ సిబ్బంది అనుమతి ఇచ్చినప్పుడు సాధారణంగా అక్కడ ముందుగానే ఫైర్ ఇంజిన్‌లను మోహరించాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజిన్‌లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో బెల్లీ ల్యాండింగ్ అనుమతించి ఫైర్ ఇంజిన్‌లను ఎందుకు మోహరించలేదని పలువురు మాజీ పైలెట్లు ప్రశ్నిస్తున్నారు. విమానాల్లో సాంకేతిక సమ స్య ఉత్పన్నం అయినప్పుడు ఎయిర్ పోర్ట్ వద్ద ఒక రౌండ్ చక్కర్లు కొట్టి బెల్లీ ల్యాండింగ్ తప్ప మరో మార్గం లేదనే సందేశం ఇచ్చిన తర్వాతే ల్యాండింగ్‌కు ప్రయత్నించాల్సి ఉం టుంది.

ఇటువంటి పరిణామాలు అక్కడ చో టు చేసుకోలేదు. విమానాశ్రయం చుట్టూ తిరిగి సంకేతం ఇవ్వకుండానే బెల్లీ ల్యాండ్ చేయడంపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేలపైకి దిగిన తర్వాత రన్‌వై చివరికి వస్తున్న సమయంలో కూడా విమానం వేగం నియంత్రణలోకి రాకపోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

సొంతవారికి చివరి సందేశం

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ప్రయాణికుడికి సంబంధించిన చివరి సందేశం మనసులను మెలిపెట్టింది. ఇంకా ఎంత సమయం ఎయిర్‌పోర్ట్‌లో వేచిఉం డాలి అని కుటుంబ సభ్యుడు అడిగిన ప్రశ్న కు ప్రయాణికుడు బదులిస్తూ ‘ఒక పక్షి విమానం ఇంజిన్‌లో ఇరుక్కుంది. విమానం ల్యాండ్ అవ్వదు’ అంటూ బదులు ఇచ్చారు. ఆ తర్వాత ‘ఇప్పుడే నేను వీలునామా రాయాలా?’ అంటూ మరో సందేశాన్ని పం పించారు. ప్రమాదం తర్వాత ప్రయాణికుడికి చాటింగ్ సందేశాలు బయటికి రావ డంతో నెటిజన్లతోపాటు స్థానిక ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. 

జేజు ఎయిర్ క్షమాపణలు

విమాన ప్రమాదంపట్ల జేజు ఎయిర్ సీఈఓ కిమ్ ఈబే క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. ‘జేజు ఎయిర్‌ను విశ్వసించిన ప్రతి ఒక్కరినీ క్షమపణలు కోరుతున్నాం. అన్నింటికంటే మించి ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలుపుతూ క్షమించాలని వేడుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడం కష్టంగా ఉంది. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు’ అని పేర్కొన్నారు. 

కెనడా.. నార్వేల్లోనూ ప్రమాదాలు

దక్షిణ కొరియాలో ప్రమాదం చోటు చేసుకున్న కొన్ని గంటల్లోనే కెనడాలో మరో ప్రమాదం జరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి 80 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం హాలిఫాక్స్ ఇంటర్నేషన్ వి మానాశ్రయంలో రాత్రి 9.30గంటలకు ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. విమానానికి సంబంధించిన ఒక రెక్క 20 డిగ్రీల కోణంలో ఎడమ వైపు వంగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే  ఎటువంటి ప్రాణాపా యం జరగలేదు. రాయల్ డచ్‌కు చెందిన బోయింగ్ విమానం నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో అదుపుతప్పింది. ఓస్లో ఎయిర్ పోర్టులో టేకాఫ్ కాగానే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఏర్పడింది. దీంతో టోర్ప్ ఎయి ర్‌పోర్టుకు దీన్ని మల్లించారు. సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ రన్‌వేపై అదుపుతప్పి పక్కన ఉన్న గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగింది. 

పక్షి కారణంగా ప్రమాదం? 

విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో దాన్ని పక్షి ఢీ కొట్టినట్టు ప్రమాదం తర్వాత బయటకొచ్చిన కొన్ని వీడియోల ద్వారా తెలుస్తుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ల్యాండింగ్ గేర్, టైర్లు పని చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినందుని ప్రాథమిక అంచనాకు వచ్చిన స్థానిక అధికారులు.. విమానాన్ని పక్షి ఢీ కొనడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమై ఉంటుందని అనుమానిస్తున్నారు. విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడి ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ మీడియాతో పేర్కొన్నారు. 

కజకిస్థాన్ ప్రమాదంపై పుతిన్ క్షమాపణ 

మాస్కో/బాకు, డిసెంబర్ 29: అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెం దిన విమానం కూలిపోయి 38 మంది చ నిపోవడంపై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్‌కు రష్యా అధ్యక్షు డు పుతిన్ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని గ్రోజ్నీ లో ల్యాండ్ కావాల్సిన విమానం అక్టౌ నగరంలో బుధవారం కుప్పకూలిన 38 మంది చని పోయిన సంగతి తెలిసిందే, ఈ ఘటనకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునేందుకు వాడిని రష్యా క్షిపణులే కారణమటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాప ణలు చెప్పడం గమన్హారం.

అయితే  విమాన ప్రమాదా నికి బాధ్యత తమదేనంటూ ప్రత్యేకంగా అంగీకరించ లేదు. రష్యా గగనతలంలో ప్రమాద ఘటన చోటుచేసుకున్న కారణంగా పుతిన్ క్షమాపణ చెప్పారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొన్నది. దీనిని అజర్‌బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. అజ ర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్రోజ్నీలో ల్యాండ్ అయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్ష ణ వ్యవస్థలు కాల్పులు జరిపాయని అంతకుముందు క్రెమ్లిన్ పేర్కొన్నది.