calender_icon.png 19 January, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదాలు..

18-01-2025 05:10:11 PM

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District)లోని అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద శనివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం హైవే(Srisailam Highway)పై 3 కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన క్షతగాత్రులను అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అటు, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం ఘాట్ రోడ్డు(Umamaheswaram Ghat Road)లో శనివారం ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో కొండపై నుంచి దిగుతుండగా బస్సు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా ఎవ్వరికి ఎలాంటి గాయలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.