calender_icon.png 12 February, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుగులపేట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

11-02-2025 08:20:58 PM

లారీ డ్రైవర్ మృతి..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అందుగులపేట సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో రెండు లారీలు ఢీకొని లారీ డ్రైవర్ బూడిద కనకయ్య (40) మృతి చెందగా, మరోకరు తీవ్రగాయాల పాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అందుగులపేట సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ముందు గల జాతీయ రహదారిపై మంగళవారం వాటర్ ట్యాంకర్ తో జాతీయ రహదారి డివైడర్ల మధ్యనున్న మొక్కలకు నీరు పట్టిస్తున్న తరుణంలో ట్యాంకర్ వెనుక వస్తున్న లారీ ట్యాంకర్ ను ఢీకొనడంతో ట్యాంకర్ రోడ్డుపై పల్టీ పడగా, ట్యాంకర్ డ్రైవర్ మాదాసు తిరుపతి తీవ్ర గాయాలపాలయ్యారు. 

లారీ డ్రైవర్ కనకయ్య లారీ క్యాబిన్ లో కూరుకుపోయి కోన ఊపిరితో మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మాదాసు తిరుపతిని మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన లారీ డ్రైవర్ కనకయ్య పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కన్నాల నివాసి కాగా, గాయాలు పాలైన తిరుపతినీ మందమర్రి నివాసిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై రాజశేఖర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.