రాజేంద్రనగర్, జనవరి 16 (విజయక్రాంతి): శంశాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో “ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ -ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్”ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారుల కోసం భారత ప్రభుత్వ మార్గదర్శక ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్ట్టీఐ-టీటీపీ) ను ప్రారంభించినటు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
విశ్వసనీయ ట్రావెలర్ ప్రోగ్రామ్ (టీటీపీ) భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు, ఓసీఐ కార్డుదారులు సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించడానికి ఇమ్మిగ్రేషన్ క్యూలను దాటవేయడానికి ఇఫు-గేట్లను ఉపయోగించుకోవచ్చన్నారు.
విమానాశ్రయాల్లో రద్దీని గణనీయంగా తగ్గించడం, ప్రయాణికులు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వేగవంతంగా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఆర్‌జీఐఎ 8 ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేసిందన్నారు. డిమాండ్‌ను బట్టి కౌంటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమంలో జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైనవారు www. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.