ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం ఉండదు
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఆర్జీకర్ హాస్పిటల్‌లో హత్యా చారానికి గురైన డా. అభయకు న్యా యం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా టీ జుడా (తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం) ఆధ్వర్యంలో ఒక రోజు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు డా. కొమ్ము రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో నిరసన వ్యక్తం చేస్తున్న జూని యర్ డాక్టర్లకు సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్, జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్, మెడికల్ స్టూడెంట్స్ నెట్‌వర్క్ పిలుపు మేరకు ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరు పీజీ డాక్టర్లు, ఇంటర్న్స్, అండర్ గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు ఈ దీక్షలో పాల్గొంటారని తెలిపారు. ఈ నిరసన కారణంగా ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని టీ జుడా తెలిపింది.