26-03-2025 01:29:41 AM
ఆమనగల్లు, మార్చి 25 ( విజయ క్రాంతి); రంగారెడ్డి జిల్లా చంపాపేట్ లో న్యాయవాది ఇజ్రాయిల్ ను హత్య చేసిన నిందితుడుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడుని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమనగల్ బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు మల్లేపల్లి జగన్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆమనగల్ మున్సిపాలిటీలో ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్ హత్యకు నిరసనగా అడ్వకేట్లు తమ బహిష్కరించి... ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
కోర్టు ఆవరణ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితునికి ఉరి శిక్ష పడాలని, అదేవిధంగా ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రామకృష్ణ, శేఖర్, మధు, మల్లేష్,జగన్ గౌడ్, గణేష్, సంతోష్, కృష్ణ, మల్లేష్, శిరీష్, బిక్కనాయక్, మురళి కృష్ణ, నరేందర్, సర్దార్, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.