calender_icon.png 22 November, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోబస్ట్ మానిటరింగ్‌తో వేగవంత పరిష్కారం

22-11-2024 02:42:57 AM

హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ లో భవన నిర్మాణాలు, లే ఔవుట్ల అనుమతులకు రోబస్ట్ మానిటరింగ్ విధానం ద్వారా దరఖాసు ్తలను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్టు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గతేడాది 2023 జూన్ నుంచి అక్టోబరు వరకు 1356 దరఖాస్తులు ఫైలింగ్ కాగా, ఈ ఏడాది అదే కాలానికి 1,884 దరఖాస్తులు అందినట్టు తెలిపారు. ఫైళ్లను వేగవంతంగా పరిష్కరించడంలో  ముందున్నామన్నారు.

గతేడాది 2,038 దరఖాస్తులను పరిష్కరించగా 2024 వాటి సంఖ్య 2,332కు పెరిగిందన్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 39 శాతం దరఖాస్తుల ఫైలింగ్ పెరగగా, 14.4 శాతం అదనంగా దరఖాస్తుల క్లియరెన్స్ పెరిగిందన్నారు.  ఇటీవల గ్రూప్ కింద ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారిలో 64 మంది సిబ్బందిని హెచ్‌ఎండీఏకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు ఉన్నారు. దీంతో హెచ్‌ఎండీఏలో సిబ్బంది పెరగడంతో రానున్న రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ల అనుమతులు వేగవంతం కానున్నాయి.