calender_icon.png 4 October, 2024 | 8:49 AM

వేగంగా సెర్చ్ కమిటీల భేటీలు!

04-10-2024 01:51:24 AM

ముగిసిన 4 వర్సిటీల సమావేశాలు

నేడు భేటీ కానున్న మరో నాలుగు వర్సిటీల కమిటీలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది యూని వర్సిటీలకు వీసీ (వైస్ ఛాన్స్‌లర్)ల ని యామక ప్రక్రియలో వేగం పెరిగింది. వీసీల నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు వరుసగా భేటీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు యూనివర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీలు భేటీ అయ్యాయి.

ఈ నెల 1వ తేదీన మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెర్చ్ కమిటీ భేటీకాగా, గురువారం మరో మూడు యూనివర్సిటీల సెర్చ్ కమిటీలు సమావేశమ య్యాయి. అందులో ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలు ఉన్నాయి. శుక్రవారం శాతవాహన, తె లంగాణ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ సెర్చ్ కమిటీలు వేర్వేరు గా సమావేశాలు కానున్నాయి.

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ యూ నివర్సిటీ సమావేశాలు వాయిదా ప డ్డాయి. ఆయా వర్సిటీ కమిటీలు స మావేశాలు నిర్వహించి వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నాయి. సెర్చ్ కమిటీల నివే దక తర్వాత ప్రభుత్వం వర్సిటీల వీసీలను నియమించనుంది. ఒక్కో యూ నివర్సిటీకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించిన తర్వాత ఆ నివేదికను గవర్నర్ ఆమోదం కో సం పంపిస్తారు.

అందులోంచి ఒక్కరి పేరును ఖరారు చేస్తూ వీసీలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. వీసీల నియామకంలో ప్రభుత్వం ఆచితూచి అడు గులు వేస్తోంది. వివాద రహితులను వీసీలుగా ఎంపిక చేయాలని భావిస్తోంది. గతంలో కొంత మంది వీసీల పనితీరుతో ప్రభుత్వం అబాసుపాలైం ది. ఈక్రమంలోనే వీసీల నియామకంపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది.