30-03-2025 12:00:00 AM
ప్రపంచంలో ఫ్యాషన్ రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. కొత్త కొత్త బ్రాండ్‌లతో పండుగ పూట సందడి చేస్తూ మగువల మనసులను దోచేస్తున్నది మన సీఎంఆర్ షాపింగ్ మాల్. ఉగాది పర్వదినం మాత్రమే కాదు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రత్యేక ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తున్నది. కొత్త ట్రెండ్‌ను ఫాలో అవ్వడమే కాదు.. మన సంప్రదాయ మూలాలను కొత్తగా పరిచయం చేస్తున్నది సీఎంఆర్. కళ్లు చెదిరే ఆఫర్లతో.. లేటెస్ట్ కలెక్షన్లతో మగువల కళ్లను కప్పేస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్కరాష్ట్రాల్లోనూ సీఎంఆర్ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది.
పెళ్లికూతురైనా దేశానికి రాష్ట్రపతి అయినా చీరలోనే అందంగా హుందాగా కనిపిస్తారు. ఇది లేకపోతే ఫ్యాషన్ ప్రపంచం వర్ణరహితమే. అందుకే భారతీయ చీర ప్రపంచ ర్యాంప్‌ల మీదా మెరుస్తోంది. సీఎంఆర్‌లో ఈ ఉగాదికి ప్లస్ వన్ ఆఫర్ నడుస్తున్నది.
ప్రింట్లు, ఎంబ్రాయిడరీలను బట్టి చీరలో వందల రకాలు, వేలకొద్దీ డిజైన్లు ఉంటాయి. ఉత్తరాన జరీ బనారసీ, లేలేత చికన్‌కారీ, పశ్చిమాన రంగుల బాంధనీ, లెహరి యా, పటోలాలు మురిపిస్తే.. మహారాష్ట్రకొచ్చే సరికి పైథానీ, మహేశ్వరి కళ్లను కట్టిపడేస్తాయి.
తూర్పునకు వెళ్తే.. ఢాకాయీ, జిందానీ, సంబల్‌పురి అందాల విందు చేస్తాయి.
దక్షిణాన చీర సంరంభం అంతా ఇంతా కాదు.. ఉప్పాడ, గద్వాల్, వెంకటగిరి, పోచంపల్లి, ధర్మవరం, కంచి, మైసూర్ స్కిల్క్.. ఇలా ప్రాంతానికో రకం నేత చీరలుంటాయి. ఇన్ని రకాల చీరలు చూడాలంటే కచ్చితంగా సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను సందర్శించాల్సిందే.