01-03-2025 12:44:20 AM
వాణి వివేకానంద విద్యాలయంలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
వైరా, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి ): ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని వాణి వివేకానంద విద్యాలయంలో సైన్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు. విద్యార్థులు సొంతగా తయారు చేసిన శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సైన్స్ ప్రదర్శనలను పాఠ శాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ చుండూరి కోటేశ్వరరావు, వాణి పరిశీలించి వాటి విశిష్టతను వివరించారు. పిల్లలు తయారు చేసిన అనేక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి సైన్స్ ఆవశ్యకత వైజ్ఞానిక శాస్త్రాలలో విద్యా ర్థులు ముందుండాలని తెలిపారు. సైన్స్ డే రోజు ఇలాంటి అద్భుత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సైన్స్ టీచర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాఠశాల నిర్వా హకులు చుండూరు కోటేశ్వరరావు, వాణి,పాఠశాల కన్వీనర్ గింజుపల్లి జనార్ధన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.