06-04-2025 12:32:07 AM
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
చేవెళ్ల, ఏప్రిల్ 5 : రైతులు ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృ తి, సేంద్రియ రైతు సమ్మేళనానికి శనివారం ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ సుజనా చౌదరితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. స్థానిక విత్తనమే ప్రధానం గా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతో పాటు సేంద్రియ ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయానికి డిగ్రీ పట్టాలు అవసరం లేదని చదువు లేని వారు కూడా సేంద్రియ వ్యవసాయం చేసి అభివృద్ధి చెందవచ్చని సూచించారు.
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఉం దని, రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూసారం దెబ్బతింటుందని, భూమి ఆరోగ్యాన్ని కాపాడడానికి మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించాలని సూచించారు.
రసాయనిక ఎరువులు వాడడంతో క్యాన్సర్, లివర్ వంటి రోగాలు వస్తున్నాయని, ప్రకృ తి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సేంద్రి య ఏసీఏఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీనా, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు భాగయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.