calender_icon.png 27 November, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పదేళ్లలో పండగలా వ్యవసాయం

29-10-2024 01:14:18 PM

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి   

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి

గజ్వేల్ (విజయక్రాంతి): గత పదేళ్లలో వ్యవసాయం పండగలా జరిగిందని, పండిన పంటలతో రైతులంతా ఆర్థికంగా ఎదిగారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్, గిరిపల్లి అక్కారం, జగదేవపూర్ మండల కేంద్రంతో పాటు ఇటిక్యాల గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాడవరెడ్డి  మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు.

గత ప్రభుత్వం లాగే కడుపులో పెట్టుకొని రైతులని చూసుకోవాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం అధికారులకు స్థానిక నాయకులు సహకరించాలన్నారు. సన్న వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ ను రైతులు పొందాలని, వచ్చే పంట కాలానికైనా అన్ని రకాల ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లించాలని కోరారు.  రైతులంతా  ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.  ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో  డబ్బులు జమ అయ్యేలా  జమ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏపిఎం దుర్గాప్రసాద్, సిసి కుమార్, గ్రామ మాజీ సర్పంచ్  పాశం బాపురెడ్డి, నాయకులు  నర్సింలు, లడ్డు,  నక్క రాములు గౌడ్, కొండల్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.