ధరణి సమస్యలు తాసిల్దార్ పరిష్కరించడం లేదని రైతుల ఆందోళన
ఏడాది నుంచి తిరుగుతున్న పట్టించుకోవడంలేదని జెసికి వినతి
ఎమ్మెల్యే రమణారెడ్డి చెప్పిన పట్టించుకోవడంలేదని ఫిర్యాదు
జెసి హామీతో ఆందోళన విరమించిన రైతులు
కామారెడ్డి,(విజయక్రాంతి): భూ సంబంధిత ధరణి సమస్యలను తాసిల్దార్ పరిష్కరించడం లేదని రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాదిగా భూ సంబంధిత ధరణి సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ ను కోరుతుంటే పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్కు సమస్యను వివరించారని అయినా తాసిల్దార్ పట్టించుకోవడంలేదని రైతులు పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్ట ర్ పాల్వంచ తాసిల్దార్ కార్యాలయానికి పంపించారు.
జెసి విక్టర్ తాసిల్దార్ కార్యాలయం చేరుకొని రైతులతో మాట్లాడారు. ఏడాదిగా కార్యాలయం చోటు తిరిగితున్న తాసిల్దార్ జయంత్ రెడ్డి సమస్యను పరిష్కరించడం లేదని జెసి విక్టర్ కు వివరించారు. తాసిల్దార్ తీరుపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అదనపు రెవిన్యూ కలెక్టర్ విక్టర్ కోరారు. రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తాసిల్దార్ జయంత్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్లను బదిలీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఏడాది అత్తమ్మ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకోలేదని జెసి కి వివరించారు. జెసియా మీతో రైతుల ఆందోళన విరమించారు.