calender_icon.png 1 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండిపోయిన వరి పంటల రైతన్నలను ఆదుకోవాలి

24-03-2025 01:35:50 AM

సీపీఎం పార్టీ డిమాండ్ 

యాదాద్రి భువనగిరి మార్చి 23 ( విజయ క్రాంతి ) : ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి 30 వేలు రూపాయలు  నష్టపరిహారాన్ని అందజేసి రైతన్నలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ  మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ... పోరుబాట కార్యక్రమంలో భాగంగా నందనం, సింగిరెడ్డిగూడెం గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

చిన్నేరు వాగు కు చెక్ డాం లేక భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల బోర్లలో నీళ్లు తగ్గడంతో సుమారు 20 నుంచి 30 ఎకరాల వరకు పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. చేతికి అందిన పంట ఎండిపోతుంటే  దిక్కు దోస నీ స్థితిలో రైతులు ఉన్నారు బొక్క భూపాల్ రెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల పొలము ఎండిపోవడం వల్ల రైతు ఆందోళన చెందుతున్నారని సిపిఎం నాయకులు అన్నారు.

ప్రభుత్వం అధికారం స్వీటీ స్థాయిలో ఎంక్వయిరీ చేసి వెళ్లిపోయిన వరి పంటల కు ఎకరానికి నష్టపరాన్ని రైతులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్  మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, శాఖ కార్యదర్శి కొల్లూరు సిద్దురాజు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు