calender_icon.png 30 September, 2024 | 7:20 PM

రెండు లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతుల ధర్నా

30-09-2024 05:58:27 PM

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  జాజాల సురేందర్ రైతులకు సంఘీభావం

కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి పూర్తిస్థాయిలో రైతులకు అమలు చేయలేదని సోమవారం కామారెడ్డి జిల్లా గాంధారిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతులకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను బ్యాంకుల చుట్టూ వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిస్థాయిలో రైతులకు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం  చేస్తామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధారిలో బాన్సువాడ కామారెడ్డి రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం ముందర పడలేదన్నారు. రైతు భరోసా వెంటనే విడుదల చేయాలన్నారు లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామన్నారు . గాంధారి మండలంలోని బుగ్గ పెళ్లి రోడ్డుకు 14 కోట్ల నిధులు తీసుకొచ్చి ఏది ధనులు ప్రారంభించామని ఇప్పటికీ ఆ రోడ్డుపై డాంబర్ వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబడ్డారు రైతు రుణమాఫీ రైతు భరోసా కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయాయని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గాంధారి మండలంలోని వివిధ పార్టీల నాయకులు రైతులు సంఘాల నాయకులు పాల్గొన్నారు.