25-04-2025 12:40:24 AM
ముత్తారంలో భూ భారతి చట్టం అవగాహన లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ముత్తారం, ఏప్రిల్24 (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుం దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ మధు సూదన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.