calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలి

04-04-2025 11:17:01 PM

సింగూర్ ఎడుమ కాలువలను వెంటనే పూర్తి చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు 

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం  సంగారెడ్డి లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వరి, జొన్న ఇతర పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సంబంధిత అధికారులు పంటలను పరిశీలించిన పంట నష్టపోమును  అంచనా వేసి నష్ట పరిహారం  ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగూర్ ఎడుమ, కుడి కాలువలకు 2008లో బడ్జెట్ కేటాయించినప్పటికీ 17 సంవత్సరాలుగా ఎందుకు కాలువల నిర్మాణం పూర్తి కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నర్సిములు, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, రాజయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.