calender_icon.png 17 April, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

08-04-2025 04:17:34 PM

బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల,(విజయక్రాంతి): పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చిట్యాల బీజేపీ మండల అద్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఈదురుగాలుల ద్వారా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ మాట్లాడుతూ... నిన్న రాత్రి ఈదుతరు గాలుల వల్ల అరటి తోట ,బొప్పాయి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేశాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.5 లక్షలు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంసారపు ప్రభాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.