calender_icon.png 25 October, 2024 | 9:51 AM

పాలు తీసుకొని పైసలు ఇవ్వకుంటే ఎట్లా..?

12-09-2024 02:53:40 PM

నెలల తరబడి బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న విజయ డైరీ 

రైతు సంక్షేమ అంటూ రైతులను ఇబ్బందులు పెడతారా

జడ్చర్ల : ప్రతిరోజు ఎంతో శ్రమించి రాత్రి పగలు అనకుండా కష్టం చేసి పాలను పితికి మీ దగ్గరికి వచ్చి పాలు పోస్తే మాకు పాల బిల్లులు ఇవ్వకుంటే ఎట్లా అని విజయ డైరీ కి పాలు పోసిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోని పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల రైతులు గురువారం జడ్చర్ల లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన వ్యక్తం చేశారు. మొదట గా రైతులు విజయ పాల డైరీ కేంద్రం వద్ద ఆందోళన చేసి షట్టర్ కు తాళం వేసి నిరసన తెలిపారు.

అనంతరం అంబెడ్కర్ చౌరస్తాలో  రోడ్డు పై పాలు పారబోసి తమ నిరసన తెలియజేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పాలు తీసుకొని పైసలు ఇవ్వకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. రైతులని ఆదుకుంటాం పాడి పారిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పుకుంటూ రైతులను నట్టేట ముంచే కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు.

ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం,  కమిషన్ ఇస్తాం లీటర్ కు ఇంత ఇస్తాము,  అంత ఇస్తామని చెప్పుకుంటూ రైతులను నెలల తరబడి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని అసనం వ్యక్తం చేశారు. మేము ప్రవేటు డైరీలకు మాత్రమే పోయారని విజయ డైరీ పరీక్షంగం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఏంటో మాకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. అలాగ చెప్తే మా పైసలు మాకు ఇస్తే మేము ఎక్కడైనా పాలన అమ్ముకొని మేము జీవనోపాధి పొందుతామని తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన ను విరమింప చేయడం జరిగింది.